Monday, December 11, 2006

కాలం కలకలం కలం హాలాహలం

కురుక్షేత్ర కదన రంగ మందు కలి కాలం
ఆసన్నమైనదని తెలిసి, భిష్ముడు కదన కలకలం
నడుమ వచించి నట్టు, వ్యాస భగవానుని కలం
నుండి సంసార జలధి మధనమున వెలువదిన హాలాహలం
ఉపసమనమునకు, అందించిన ఔషదమే విష్ను సహస్ర నామము. ==KPKonduru
======================================

ప్రకృతి తన అందాలతొ మన కనులకు
విందును కలిగించె కాలం వసంత కాలం
ప్రాతః సమయాన మన్సుకు మైమరుపు
కలిగించె తీయని గానం పక్షుల కలకలం.
భగవత్‌ సృష్టిని తన కాలుష్య కలంతొ
తిరిగి రాస్తున్న నరునికి తన చర్యల ఫలమే హాలహలం. ====Himabindu
======================================
ఎద కోయిల ఎగరసాగె ఎదురయ్యెనని వసంతకాలం...
మది నిండ ఎన్నొ మరవలెని గత స్మ్ర్తుల కలకలం...
అది మోడు వారిన పాడు తలంపుయని పట్టినాను కలం...
పదాలుగ మారింది నా మది గదిలొ నిండిన హాలాహలం...!!! ====vEturiR

No comments: