Monday, December 11, 2006

వల కల అల సిల

చేతిలో వల
నావ కింద అల
దొరికింది ఉట్టి శిల
ఔరా! ఇది ఒక కల ==== SriKaanth
======================================

యువతీ,యువకులంతా ధన, జన, యవ్వన గర్వంతో విసిరెరు ఓ వలపుల వల
ప్రేమ ముడిపడి, పెళ్ళిగా పరిణమిస్తే, జీవితం కాదా వారికి ఓ యెగసిపడే అల
ఈతి బాధల కుంపట్ల నీడుస్తూ, ప్రేమ రాహిత్యానికి లోనై, వారు కారా కదిలె ఓ సిల
గుర్తించెరుగా వారు, జీవితం అంటేనే నిరంతరంగా సాగె వాస్తవమైన ఓ కల ====ushaneni2004

మెరుపు మరుపు తలపు తెలుపు

హృదయ సీమ ఆనంద ధారలలొ తడిసినప్పుడు
కనపడును మనకు నయన తరకలలోని మెరుపు
జీవితం నెర్పే కఠినా పథాలలొ కలిగిన గాయాలకు
భగవంతుడిచ్చిన దివ్యౌషధము మతి మరుపు
మదిని నింపకు గతము మిగిల్చిన మధురస్మృతులతొనూ...
మనకు తెలియని భవిష్యత్తుపై ఆశలతొ నిండిన తలపులతోనూ
వర్తమానంలో జీవించమని జనులకు చాటుతూ
సమాజశ్రెయాస్సుకై పాటుపడుదామని ప్రపంచమునకు తెలుపు. ====himabindu

=============================

కారు మబ్బుల చీకటిలొ కాంతి వంతమైన మెరుపు లాంటి కాంత
నాకు మతి భ్రమించి మైమరపు తో నా హృదయం ఊగిసలాడుతూ
ఎచటనో చిక్కుకున్న నా తలపు నాలో కించిత్‌ నొప్పిని కలిగిస్తూ
నా వివెకము మాత్రము నన్ను ఈ లొకమునకు థిరిగి రమ్మని తెలుపుతున్నది. === MSNGupta
=================================

తన నవ్వే చూపించు ఆమె మనసు తెలుపు
ఆ కనుల వెలుగు చూసి అలిగి పోదా...మెరుపు
మనసున కొలువైనది ఈ నా చెలి తలపు
కనులు తెరచినా.....వీడిపోనిది ఈ మైమరపు =====mbnr guy

చదరంగం అనుబంధం కలిసుందాం నేర్చుకుందాం

లంచ మనే చెద రంగ రంగాలలొ వ్యాపిస్తుంది
సమజం లొని "నిజాయతీ" అను బంధా లని తెంచేసుంది
పేట్రేగిన ఆ కలి, ఆకలి సుందరంగ మందంగ నడుస్తుంది
యువత తెలివి నెర్చుకున్‌ దామోదరుని పై భారం వెసి భజన చేసెన్‌!! ====KPKonduru
========================================

జీవతమనే చదరంగంలో రాజు నేనే భటుడు నేనే
రెండు ప్రక్కలు నెనే, ఇక్కడ వున్న రుల్సే అనుబంధం
ఒకరికి ఒకరు బంధించి బడ్డారు, అన్ని నేనైతె, ఎవరికి ఎవరు?
ప్రక్క వాడి లొ ఇల నన్ను నెను చూసు కున్నప్పుడు కలిసుందాం
అన్న అలొచనకి తావు లెదు, వెరై వుండే అవకశమూ లేదు
ఈ లాజిక్కుని నేర్చుకుందాం, సర్వే జనాః సుఖినో భవంతు!! ====KPKonduru

కాలం కలకలం కలం హాలాహలం

కురుక్షేత్ర కదన రంగ మందు కలి కాలం
ఆసన్నమైనదని తెలిసి, భిష్ముడు కదన కలకలం
నడుమ వచించి నట్టు, వ్యాస భగవానుని కలం
నుండి సంసార జలధి మధనమున వెలువదిన హాలాహలం
ఉపసమనమునకు, అందించిన ఔషదమే విష్ను సహస్ర నామము. ==KPKonduru
======================================

ప్రకృతి తన అందాలతొ మన కనులకు
విందును కలిగించె కాలం వసంత కాలం
ప్రాతః సమయాన మన్సుకు మైమరుపు
కలిగించె తీయని గానం పక్షుల కలకలం.
భగవత్‌ సృష్టిని తన కాలుష్య కలంతొ
తిరిగి రాస్తున్న నరునికి తన చర్యల ఫలమే హాలహలం. ====Himabindu
======================================
ఎద కోయిల ఎగరసాగె ఎదురయ్యెనని వసంతకాలం...
మది నిండ ఎన్నొ మరవలెని గత స్మ్ర్తుల కలకలం...
అది మోడు వారిన పాడు తలంపుయని పట్టినాను కలం...
పదాలుగ మారింది నా మది గదిలొ నిండిన హాలాహలం...!!! ====vEturiR

వలపు తెలుపు నలుపు కలుపు

(1)
అలనాటి మహా నటి సావిత్రి, వలపు
వలలో పడి తోటి నటుడికి స్వచ్చమైన తెలుపు
లాంటి జీవితాన్ని అర్పించ, తెలుపు నలుపు
లకు తేడాలేని ఆ జీవి ఆమె జీవితాన్ని కలుపు
మొక్కవలె నాశనము చేయ ఆంధ్రులందరి
హ్రుదయాలు ఆమెకై పరితపించె

మహా నటి సావిత్రి పై అభిమానముతో ===SeetaKumari

==============================

నే ప్రెమించిన ప్రియురాలి వర్ణంబు తెలుపు.
తనకై నే కొన్న చిర రంగు కారు నలుపు
నా బహుమతి గైకొన్న మరల తను క్రుపించె ప్రేమ వలపు
హే కృష్నా ఇంక తళలేను మా ఇరువురిని ఒక్కతిగ కలుపు ====ChatrapatiShivaaji

Thursday, December 7, 2006

రాగం భాగం అనురాగం చదరంగం

ప్రతి మొదటి అనుభూతి మన మదిలొ ఒక ముద్ర వేస్తుంది
మొదటి లాలి కల్యాణి రాగమై చిచ్చు కొడుతుంది
మొదటి పలుకు అమ్మ చెవిని చేరి ధన్య మవుతుంది
మొదటి గిలక్కై గురుతుకొచ్చి నవ్వు తెప్పిస్తుంది
మొదటి స్నేహం మనుగడలో భాగమై గురుతుంటుంది
మొదటి పరీక్ష జీవితానికి దారి వేస్తుంది
మొదటి ప్రేమ యెదలొ అనురాగమై లీన మవుతుంది
ఒక్కొక్క అనుభవం ఒక గడిగా
కూర్చ బడిన చదరంగమే మన జీవితం
ఏ ఒక్క గడి మరచినా చదరంగంలో గెలవలేము ...

============================== KPKonduru

సింధూరారుణ కిరణ భూషితయు
సంధ్యా రాగ మాలికా విలసితయు
కాల చకరార్ధ భాగ నివసితయు
బూపాళమనురాగ పరివేస్ఠితయు
శ్రి చకర పుర వసితయు
నా హృది నిద్రాణములు చెదరంగ వెలసినదియు
నగు సంధ్యా గాయత్రి కభివాదములు!!
============================== KPKonduru

నిత్యం సత్యం వైవిధ్యం అక్షయం

పెత్తందార్లతో విధి ఆడుతున్న చదరంగంలో
పేద పావుల బలి పీఠ మిది!.
నిత్య నగ్న జీవిత సత్యమిది !!
స్వార్ధ నాయకుల పదవుల పోరాటంలో
చిందిన బిఖారి నెత్తుటి పధ మిది!.
నిత్య నగ్న జీవిత సత్యమిది !!
గెలుపు డప్పుల దడ దడ మధ్య
ఎగిరిన పువ్వుల దండల మధ్య
పేదవాడి ఆకలి రేపిన సోషలు
గెలిచిన నేతకు వైవిధ్యపు జయజ ఘోషలు !!
బానిస సృంఖలాలు తెంచిన నేతలేరి?
తెల్ల నేతల గుండెలు పేల్చిన ఫిరంగులేవి?
నేర చరితల నేతల తలలు తీసే బిడ్డలేరి?
వీర పుత్రులు గన్న అక్షయ గర్భమిది
వుడుకుతున్న రక్తపు సెగల మంటలివి
ఇంకెంతో కాలం లేదు.. మంచిరోజులొస్తున్నాయి!! ====KPKonduru

==========================

నిత్య యవ్వన సౌందర్య రాశివి
సత్య కామనా మానసోల్లాసివి
వైవిధ్య శృంగార కళా పోషివి
అక్షయ అశీర్వచనాంబొధివి, తల్లివి..శాంభవీ ==== KPKonduru

========================

పేదవాడి బతుకులో ఉన్నాయట పరమాన్నాలే నిత్యం...
పెద్దవారు, మన నాయకులు చెప్పె నిత్య అసత్యం...
పూట తిండికి పేదలని, పెద్దలని ఎందుకు ఈ వైవిధ్యం?
పొరాడకుండ దొరుకుతుందా ఆకలికాలంలొ అక్ష్యం?? =====vEturiR

=====================================

కొందరు జీవిస్తుంటారు కలల్లొనే నిత్యం
కలలు కల్లలవగానె తెల్స్తుంది అసలు సత్యం
అపుదె మొదలవుతుంది ఈ రెండెంటి మధ్య వైవిధ్యం
ఆ గడబిడలొ వారికి పరిష్కరం లేని సమస్యలే అక్షయం ====SeetaKumaari

Wednesday, December 6, 2006

విమానం రైలుబండి బస్సు జట్కాబండి

ఊహల గగనాన విహరిస్తున్నప్పుడు
హృదయమే ఒక విమానం.
ఆలోచనలనే పట్టాలపై పరుగెడ్తున్నప్పుడు
మనసే ఒక రైలుబండి.
సర్వాంగాలనే ప్రయాణీకులను
మెదడనే డ్రైవరును,గుండే అనే కండక్టరును
కలిగి యున్న తనువే ఒక బస్సు
సంతోషమనె ఇంధనం లేనప్పుడు
దేహమనే బస్సే అవుతుంది జట్కాబండి. ====himabindu

====================

electionla time..అందరికీ తెలిసిన పరిస్థితే
తెలంగాణా అని రాస్ట్రాన్ని చీల్చె వాళ్ళు కొందరు
ఎదొ ఒకటి చేసి రాస్ట్రాన్ని centerకి అమ్మే వళ్ళు కొందరు
మంచి qualifications కల వారు మన candidatలు
కొంపలు కూల్చారు, రైలుబండ్లు తగలెట్టారు
బస్సులు పగలు కొట్టారు, దర్నాలు బందులకు stopఏలేదు
మర్డర్లు మాన భంగాలంటార, అవి చిన్నప్పుడే చేసారు
వీరికి లేనివి మానం, మర్యాద, మంచి చేసే గుణం
ఐనా, వీళ్ళని గెలిపించే వారు ఎవరు?
మనమే వొటు వుండీ, వెయ్యని ప్రభుద్దులం.
ఐనా, జట్కా బండి time నుంది, విమానాల స్థాయికి
దేశం ఎదిగింది. అదే మంచి వార్ని గెలిపించి వుంటే
ఈపాటికి దేశంలో సగం మంది, చంద్రుని మీద
కాపురాలుండేవారు, coloneeలు కట్టే వారు,
americanలు visa green cardల కోసం దేశంలొ queuలు కట్టెవారు
ఇప్పటి కైన బుద్ధి తెచ్చుకుని, కళ్ళు తెరుద్దాము.
================================ KPKonduru

బాధ గాధ లాగు బాగు

టీనేజి ప్రేమ విఫలమైన యువకుడి దిన దిన బ్రతుకే ఒక బాధ
కడుపు చించుకుంటె కాళ్ళ మీద పడుతుంది విషాద దీన గాధ
ఎంత మరిచి పోదామన్నా ప్రియురాలి మీదకే మనసు లాగు
నిజం తెలుసుకొని ఎప్పుడు పడుతుందో వాడి జీవితం బాగు! ====rOhiNi

===================================

యెవరికి చెప్పుకుంటె తీరుతుంది బ్రహ్మ్మనందం బాధ...
కొవై సరళ ని కట్టుకొవడంతో మొదలయింది వాడి దీన గాధ...
రావొయి అంటూ ఒకసారి పిల్చాక మనసిలాయొ అంటూ మనసు లాగు...
పోవొయి అంటూ కసిరెసి, కిందెసి, తొక్కేసి అంటుంది... బాగు బాగు!!! ====vEturiR

===========================

ఓ రాధా ఓ రాధా విన రాదా నా బాధ
కామాలే తప్ప ఫుల్స్టాప్ లేని నా గాధ
నీవే తప్ప ఎవరూ మార్చలేరు శుభంలా ఎలాగు
అందుకె త్వరగ తేల్చు అందరు అనంగా బాగు బాగు =====SeetaKumari

ఆగు పోకు తాగు సాగు

దురాశల యెండమావుల వైపు పరుగెత్తకు, ఆగు!
అత్యాశల చేతలకు, తప్పుడు పోకడలు పోకు
నిజాయితీ నీళ్ళు నిలబడి నువ్వు తాగు
అప్పుడే అందరికీ ఆదర్శంగా నీ జీవితం సాగు ==== rOhiNi

డేగ ఏగ జాగ పొగ

coffee hotel లొ వెతుక్కున్నా కూర్చోడానికి మూలగా ఓ జాగా
cigaretల నుంచి వచ్చి చుట్టుకుంది నన్ను దట్టమైన పొగ
sarvar తెచ్చిన coffe కప్పు లో వెతికా ఉందెమొ అని ఓ ఈగ
కొపం తో చూస్తున్న వాడు కుమ్మెస్తాడేమో అయి ఓ డేగా...
==========================
పైన ఎగురుతుది డేగ
కింద ఊగుతుంది ఈగ
మధ్యలొ బోలెడు ఖాలి జాగ
అందులొ ఉన్నధి అంతా పొగే పొగ..

==============================
వేసవి సాయంత్రం పెట్టిన జీడి గింజల పొగ
తరిమింది అక్కడే తచ్చాడుతున్న దోమల గుంల్పులొని ఒక ఈగ
పొగచూరి, కళ్ళు మండుతున్నా వదల్లేదు మెము ఆ జాగా
ఇంతలొ చిన్ని గాడు వచి గింజల్ని ఎత్తుకు పొయాడు అయి ఒక డెగ...

ధమాల్‌ కమాల్‌ గతి పతి

పండగ సందర్బంగ పట్టుచీరల ధమల్‌ వచ్చింది
చీరలు చూసి "వహ్‌ ఖ్యా ఖమాల్‌" అనుకుంది ఓ పడతి
ధరలు చూసి కళ్ళు తేలేసడు ఆమె అమయకపు పతి
ఇక ఆ తరవాత చెప్పేదేముంది అతని గతి
=========================
నెను చెప్తా, నిన్న రాత్రి జరిగిన ఓ కమాల్‌
నె చెప్పిన కవిత పెలింది గా అని, ధమాల్‌
నె చెప్పిన కవితకి షెబాష్‌, అన్నారు, నా పతి
అది విన్న మనస్సు తిప్పింది మల్లి మల్లి దాని గతి...
================================
పడ్డాను ఓ అమ్మయి ప్రేమ లో
తిరిగాను అమ్మయి చుట్టూ దొమ లా
గిచ్చుకున్నను నన్ను నెను నిద్రలో
తెలుసుకున్నను అధి ఓ పిచ్చి కల అని
===================
నా పెళ్ళి ఒక పెద్ద ధమాల్‌,
ఆందరు అన్నరూ..."వహ్‌ క్యా ఖమాల్‌"
తరవాత అర్ధమయ్యింది నా ముష్టి గతి,
ఎందుకంటే..నాకు దొరికినొడు..ఒక చెత్త పతి
======================

శుష్క వాగ్దానాలతో అవుతాడు గల్లీ నాయకుడు - అధిపతి
అతడిని నమ్మి అధికారమిచ్చిన సిల్లీ ప్రజలకు - అధోగతి
ఆశ చావని జనం అనుకుంటారు, చేస్తాడులే ఏదో ఒక కమాల్
బాస చేసిన వాడు మాత్రం చేస్తాడు ప్రజలన ఆశలు ఢమాల్ !!

పట్టు కట్టు చిట్టు అట్టు

ముద్ధుగ ఉన్న మా కుక్క ని పట్టాను ఒక పట్టు
అది పిక్క పీకగ కట్టించుకున్నను ఒక కట్టు
ఇంతలో వెధవ ,గొల పెట్టాడు మ అబ్బయి చిట్టు
సంధి చెయ్యటానికి వెసిచ్చాను వళ్ళిదరికి ఒక అట్టు
=========================
పట్టు చీరలపై మొజు పడే ఆడవారు
నేత చీరకట్టులోని సొగసునెరుగరు
ఛిత్తుగా మధ్యపానమును సేవించు మగవారు
అమ్మ చేతి కమ్మనైన అట్టు రుచినెరుగరు
==============================
లక్ష్యంపై ఉడుము పట్టూ కలిగి వుండాలి
అబద్ధాలు కట్టుకధలు అల్లకుండా వుండాలి
ఎదురయ్యె సమస్యలను చిత్తుగా వొడించాలి
అమ్మ చేతి అట్టుతొ విజయాన్ని ఆస్వాదించాలి.

అల్లం బెల్లం కళ్ళెం పళ్ళెం

తియ్యగా ఉందని బెల్లం
తినక పోగా కూరలొ అల్లం
ఇస్తే కాళీ పల్లెం
నా అకలికి ఉండదు కళ్ళెం
============================
కలిపానొక వాయి పచ్చదితో, అదీ నాకిస్టమైన అల్లం
వెంటనే నొటిలొ అగ్నిపర్వతాన్ని ఆపటానికి తిన్న బెల్లం
ఎలగైతేనేమి ఖాళీ చెసా, నిండుగా ఉన్న పళ్ళెం
కడుపులో భీభత్సంతో, ఇక వెయ్యలెకపొయా, నీటి అవసరానికి కళ్ళెం !!!
===========================
పెళ్ళాం తెమ్మంది నన్ను అల్లం,
మర్చిపొయి తెచ్చాను బెల్లం
కోపంతో విసిరింది పళ్ళెం,
వెయ్యలేకపొయా దాని తిట్లకు కళ్ళెం!
====================
నాకెందుకు నీ అల్లం
వెయ్యి నీ మాటలకిక కళ్ళెం
అయినా ఖాలి గ లెదు నా పల్లెం...
నా దగ్గరుంది బొలెడంత బెల్లం!!!
=========================

తెలుసా నీకు కళ్ళెం?
correct గా చెబుతే నీకు బెల్లం
లేకుంటె నీకు అల్లం
కాళీగ వుంచుకో నీ పళ్ళెం

మల్లి పల్లి బల్లి పిల్లి

ఒక్క మూడు రూపాయలేగ అని కొన్నా మూర జజిమల్లి
ఎక్కి మూడు గంటలయినా ఈ బస్సు చేరదా నాంపల్లి?
తొక్కి తొలు తీస్తుంది లేటు అయితే నా రాక్షసబల్లి
చిక్కిన చిట్టెలుక లాంటి నా పాలిట పెద్ద గండు పిల్లి !!!

=============================
ప్రేమ తో ఆమెకు ఇచ్చాను మల్లి
తినడానికి తెచ్చాను పల్లి
ఇంతలొ కనిపించింది పక్కనే బల్లి
పులి లాంటి నేను అయిపొయాను పిల్లి...

జాజి మాజి రాజి గంజి

ఆఫీసులో కొత్తమ్మయి అనుకొని ఇచానొక విరజజి
తీర చూస్తె ఆ అమ్మయెవరో కాదు నా మాజీ
కోపమొచ్చిన మా ఆవిడ, రాత్రికి లేదంది ఎటువంటి రాజి,
కస్సుమని లెచి పోసింది నా మొహాన ఓ గిన్నెడు గంజి!!!

తొక్క చెక్క వక్క ముక్క

తిన్నవంటే అరటిపందు థొక్క
కొడతా తీసుకుని చెక్క
వుండ ఆకులొ వక్క
స్వర్గం కదా ఆవకై ముక్క

చిక్కు ముక్కు హక్కు ఎక్కు

లుక్కు లేకనే కదా ఈ చిక్కు
పక్కులు కట్టె పక్కవడి ముక్కు
అవి తీయుటకు లెదు నాకు హక్కు
ముక్క్లొ పక్కులెక్కువని నాకు తిక్క ఎక్కు
========================
ఎంటొ ఈ చిక్కు
ఆఇ.. పట్ట్టుకోకు నా ముక్కు
నీకులేదు ఆ హక్కు
ఇక పద బుస్సు ఎక్కు

నువ్వు రువ్వు పువ్వు నవ్వు

ఆపు ఇక ఆ నవ్వు
నువ్వే పెట్టుకో ఆ పువ్వు
నన్ను మర్చిపొ ఇక నువ్వు
కొపం తెప్పించకు కత్తితొ చెసెస్తా రువ్వు
==================
కావలి అనిపించింది నాకు నూవు
అంగీకారం అయితే అందుకో ఈ పువ్వు
వద్దంటే కురిపించొద్దు నిప్పుల రువ్వు
ఆ నా తొలి కవిత విని అందరు గొల్లున నవ్వు
==========================
అతడు ఆమెని చేసాడు లవ్వు
మురిసిపొయాడు చూసి అమె నవ్వు
అయింది వాడికి వళ్ళంతా జివ్వు
చివరకు అమె పెట్టింది వాడి చెవిలో పువ్వు
=========================

పడేసింది ప్రేమలొ నీ నవ్వు
కావాలి నాకు నువ్వు
అందించాను కానుకగా పువ్వు
ద్వెషంతొ నిప్పులు రువ్వుతున్నవు నువ్వు

వల అల తల కల

ఓ రాత్రి....
విసురుచున్నారు ప్రీతి థొ అప్సరసలు వలపుల వల
అందు చిక్కి ఊయలూగెను నా మదిలొ అల అలా అలాఆ
ఇంతలోనే సతీమణి చెతి వ్రేటు చూసెను నా తల
అహో హతవిధీ ఇలా చెదిరెనా నా అందమైన కల

కరి వరి సరి మరి

వేసవి వెళ్ళాక పడుతుంది తొలకరి
ఇక చక్కగా పెరుగుతుంది వరి
వర్షాలు చక్కగ పడితే సరి
లేకపోతే నీళ్ళకు వేరే మర్గం వెతుక్కోవాలి మరి

వెలుగు జిలుగు మెరుగు పరుగు

మెరుపు వెలుగులో చె జారింది నా మనసు
చూశాక ఆ నవ యవ్వని వన్నెల జిలుగు
వాన నీతిలొ కరగని తన మేని మెరుగు
ఇక చెప్పక తప్పలెదు నా కాలికి పరుగు
==========================
కళ్యాన మండపాన రంగు రంగుల దీపలు వెలుగు
పెళ్ళివారి అలంకరణాలు జిలుగు
వాటికంటె పసి పిల్లల ఆటలు మెరుగు
పిల్లల వెనుక పెద్దళ్ళ పరుగు

దీపాలు కోపాలు రూపాలు జపాలు

ఇంటి ముందు పెడుతోంది ఇల్లాలు దీపాలు
పెంట నుండి లేచినట్టు ఉన్నాయి మా స్వరూపాలు
వంట చెయలెదింకా అంటూ చూపించె కోపాలు,
ఆంతీ... గురుతుపట్టలేదా..మేమంటూ మొదలెట్టాము జపాలు!!!
=====================================

దీపవళి పర్వదినాన వెలుగుతున్నాయి ప్రతి ఇంటా దీపాలు
ఆ కాంతికి దెదీప్యమయ్యయి మనుషుల ముఖ రూపాలు
పిల్లలకు జాగ్రత్తలు చెపుతూ పెద్దవాళ్ళ కోపాలు
తమను తాము సముదయించుకోదానికి మళ్ళి జపాలు

మిసమిసలు బుసబుసలు రుసరుసలు గుసగుసలు

పెళ్ళి రోజు.....
అమ్మాయి సిగ్గ్గు మొగ్గల మిసమిసలు
అబ్బాయి అంద చందాల గుసగుసలు
ఆదపెళ్ళి వారు పనివాళ్ళపై రుసరుసలు
మగపెళ్ళి వారు మర్యాదలపై బుసబుసలు

==========================
ఛెట్టు కింద కుర్చున్న ప్రేమికుల మిసమిసలు
ఆఅ వెనకే పాము బుసబుసలు
పాముని గమనించని ప్రేమికుల గుసగుసలు
ఆ దృశ్యాన్ని చూసిన బాటసారుల రుసరుసలు
=================

టీవీ లో యా0కరు మిసమిసలు
వ0టగది లొ గిన్నెలో పాలు బుసబుసలు
మా ఆవిడ నాపై రుసరుసలు
నన్ను చూసి వీదిలో వాల్ల0తా గుసగుసలు

=================

దనము వనము ఘనము కరము

మంచుదేశమే కాని మంచునకు సైతం అడిగెను ధనము
అందుకే మొదలెట్టా కోపమున కవిలాగ పెద్ద కవనము
ఎందుకో ఈ దేశం మేడి పండులాగ పైకి మాత్రమే ఘనము
ముష్కరులను పెంచి పొంపలు ముంచుటలో అందెవేసిన కరము
=========================

మానవాళి కి వైధ్యమె ఒక వరము
కాని నేటి ఆసుపతృలు హంగుల వరకె ఘనము
రోగం కుదురుటకు కావలె కొట్లా కొలది ధనము
ప్రణానికి ఖరీదు కట్టి మానవతను తెగటార్చు కరము

==================

వందనం....నా పేరు ఇంధనం
నేను లేక స్థంభించు నీ జీవనం
నా ఉత్పత్తులూ వాటి ఉపయోగాలు ఘనం ఘనం
సద్వినియోగం స్రేయస్కరం లెదా ఎంతో ప్రమాదకరం........
======================

కునుకు చినుకు తలుపు మలుపు

అప్పుడె పట్టింది చిన్న కునుకు
వెళదామని బయలుదేరుతున్న తణుకు
నేవస్తున్నానని చిటపట మంది చినుకు
ఎమిటో ఈ మలుపు, దబదబ మంది తలుపు
=========================

ఊరటగా పడుతొ0ది వెసవి చినుకు
చల్లగాలికి పట్టి0ది చక్కటి కునుకు
వాలుటకు సహకరి0చెను కిటికి తలుపు
నా కర్మకి అప్పుడే డ్రైవరు తీసాడు మలుపు
అబ్బా....ఇ0కెము0ది నా మెడ బెణుకు

రవి కవి చెవి భావి

అస్తమించిన రవి
సృజనాత్మకత లేని కవి
యెండిపొయిన బావి
సాహిత్యం లేని సంగీతం విన్న నా చెవి
భారత దేశ పూర్వ వైభవం కొసం నా ఆకలి

==========================
పడమర అస్తమిస్తున్నాడు రవి..
అ0టూ మొదలెట్టాడో కవి
అది విని వాచిపోయి0ది నా చెవి
పిఛ్ఛి పట్టి చూసుకున్నానో బావి
===================

అప్పటికే ఆరయిందని అస్తమిస్తున్నాడు రవి
కాలయముడిలా కనిపించాదు పక్కింటి కవి
అప్పుడు గుర్తుకొచ్చింది పారేసుకున్న తళం చెవి
వళ్ళుమండి దూకుదామన్నా కనిపించలేదు నాకు భావి

======================

కలకల కిలకిల మిలమిల వెలవెల

Function అంతా కలకల
పిల్లల అటలతో కిలకిల
ఆదువరి తళుకులు మిలమిల
మగవారేమొ వెలవెల
==============

పెళ్ళి మాట వినగానే ఆమె మొహమంతా కలకల
ఆమె నవ్వు చిలకల కొలికిలా కిల కిల
ఏమి పేస్టో గాని మెరిసెను ఆమె పళ్ళు మిల మిల
తేస్టు లేని వేప పుల్ల అనగానే మాడి పోయాను వెల వెల

=======================

తను విను నన్ను మన్ను

నా గర్ల్ ఫ్రె0డు కాదే తను
కాస్త అయినా నా మాట విను
నిజ0 చెపుతున్నాను నమ్మవే నన్ను
మరీ అలా నోటిలో పెట్టకే మన్ను

కోట పేట బాట చేట

కోట ప్రదేసానికి వెల్తు తప్పాను బాట
సరి అయిన మార్గం కోసం సగించను వేట
అప్పుడు కనిపించింది ఒక పాత కోట
నిసితంగా పరిసీలిస్తుంటే దొరికింది ఒక చిరిగిపోయిన చేట
==============================
నేనొక చక్రవర్తిని...
నాకొక దిగ్విశాలమైన కొట..
మంత్రులు సేనానులతో వెలుతున్నాము
అడవికి చెయ్యడానికి వేట..
ఉత్సాహకరంగా సాగుతోంది బాట,
ఇంతలూ కొడుతున్నారు ఎవరో
నెత్తిమీద పటా పటా..
కళ్ళు తెరిచి చూస్తీ ఏముంది...
పళ్ళు బిగించిన భార్య,
చేతిలో నెత్తి మీద మొదుతున్న చేట.
================================
చేత చేట పట్టి చెరుగుతూ నీ చెలి
పాడుతుంది పల్లె పదములను పాటగ
కోటలోని ఓ రాజా ఎక్కడున్నావు నీవు
మరిచావ ఆ భాట ఇక వెళ్ళు త్వరగా

రాయి పరాయి పావురాయి కల్పనారాయి

కోతి మనసు అయ్యిందో కొక్కిరాయి
అడ్డువేసెను తెడ్డుమాదిరి ఓ నాపరాయి
బాపురేయని పారి పోయెను పావురాయి
రాయి చిద్రమవగా సిగ్గు పడెను కల్పనారాయి

గురి చూసి వేసాను ఓ చిన్నరాయి
అది తగల కు0డా పారిపోయి0ది పావురాయి
నన్ను చూసి నవ్వి0ది కల్పనారాయి
నేను వేస్తా చూడు అ0టు తీసి0దో నాపరాయి

చీర మూర కూర పులిహోర

అందంగా సింగారించింది చీర
జడలొ పెట్టింది మల్లెపూల మూర
వండుతోంది ఘుమ ఘుమలాడే కూర
దానికి తోడు ఉందిగ మన పులిహొర

వళ్ళు ఝల్లు తేలు జోళ్ళు

ఎంటొ హయిగ పడుతుంధి వాన జల్లు,
ఆప్పుడు కనిపించింది చాప కింద తేలు
ఒక్కసారిగ ఝల్లు మంది వళ్ళు
ఫరుగున థెచ్చా భాటా జోళ్ళు.

కురిసింది తొలకరి ఝల్లు
ఆద మరిచింది వల్లు
వేసుకోలెదు నేను కాలి జోల్లు
కుట్టింది దిక్కుమాలిన తేలు

తప్పు కప్పు చెప్పు నిప్పు

అప్పు చేసి తెచ్చా ఒక కప్పుడు పప్పు
తరువాతే తెలిసింది నే చేసిన తప్పు
అదేమిటంటె మరువటం నిప్పు లాంటి అప్పు
నా పప్పెదంటూ పట్టుకొచ్చింది చెప్పు
=======================
ప్రేమ పేరెత్తాను తప్పు అనుకుందా
కప్పు పక్కన పెట్టి చెప్పు తీసింది
రెండు జన్మలకైన మరచిపొకుండా
నా బుగ్గకంటించి నిప్పు తెప్పించింది
=========================

పెట్టాను దీపవళి టపాసుకి నిప్పు
అదెళ్ళి తట్టింది పక్కింటి కప్పు
చిర్రెత్తి చూపించారు వళ్ళు చెప్పు
తెలిసొచ్చింది నాకు చెసిన తప్పు

ఎండ కుండ బండ కండ

గుండు మాడేలా మండింది ఎండ
కూర్చోబొథె కాల్చింది బండ
వెదికాను నెను ఒక చన్నీల్ల కుండ
తగు సమయమని కుక్క పీకింది కంద

ప్రేమ దోమ పిచ్చి గిచ్చి

ఎమి ఈ ప్రేమ
నన్నే కుడుతొంది ఈ దోమ
చంపుతోంది గిచ్చి గిచ్చి
గొక్కోలేక కలుగుతోంది నాకు పిచ్చి

నవ్వు జివ్వు లవ్వు పువ్వు

ఎంత అందమైన నవ్వు
ఆ నవ్వు చూస్తె నే వొల్లంతా జివ్వు
అలా మొదలైంది లవ్వు
అందుకే ఈ పువ్వు
================


లవ్వు పెరగాలంటే కావాలి పువ్వు
కొవ్వు కరగాలంటే కావలి నవ్వు
=================

జీతమివ్వగానె వచ్చింది నవ్వు
అంతలో గుర్తుకొచ్చింది లవ్వు
అనిపించింది నా వొళ్ళంతా జివ్వు
వెంటనె కొన్నానొక పువ్వు
================