Thursday, December 7, 2006

రాగం భాగం అనురాగం చదరంగం

ప్రతి మొదటి అనుభూతి మన మదిలొ ఒక ముద్ర వేస్తుంది
మొదటి లాలి కల్యాణి రాగమై చిచ్చు కొడుతుంది
మొదటి పలుకు అమ్మ చెవిని చేరి ధన్య మవుతుంది
మొదటి గిలక్కై గురుతుకొచ్చి నవ్వు తెప్పిస్తుంది
మొదటి స్నేహం మనుగడలో భాగమై గురుతుంటుంది
మొదటి పరీక్ష జీవితానికి దారి వేస్తుంది
మొదటి ప్రేమ యెదలొ అనురాగమై లీన మవుతుంది
ఒక్కొక్క అనుభవం ఒక గడిగా
కూర్చ బడిన చదరంగమే మన జీవితం
ఏ ఒక్క గడి మరచినా చదరంగంలో గెలవలేము ...

============================== KPKonduru

సింధూరారుణ కిరణ భూషితయు
సంధ్యా రాగ మాలికా విలసితయు
కాల చకరార్ధ భాగ నివసితయు
బూపాళమనురాగ పరివేస్ఠితయు
శ్రి చకర పుర వసితయు
నా హృది నిద్రాణములు చెదరంగ వెలసినదియు
నగు సంధ్యా గాయత్రి కభివాదములు!!
============================== KPKonduru

4 comments:

రాధిక said...

మొదటి స్నేహం మనుగడలో భాగమై గురుతుంటుంది...nijamea
chala baagundi mii kavita

vrdarla said...

నాలుగు పదాల ఆట చాలా ఆలోచనాత్మకంగా ఉంది. తెలుగు పట్ల మీకున్న అభిరుచికిది నిదర్శనం!అభినందనలు!!

కొండూరు కృష్ణ (ఆత్రేయ ) said...

VenkatEswara Rao Garru dhanya vaadaalu. naaku telugulO padyaalu raasETanta parignanam lEdanDi. edo tochinantalO edO kaasta raayaalani tapana. visit chEsi comments raasinanduku marosaari dhanya vaadaalu.

saisahithi said...

నాలుగు పదాల ఆట చాలా బాగుంది. మంచి ఆలోచన.