Thursday, December 7, 2006

నిత్యం సత్యం వైవిధ్యం అక్షయం

పెత్తందార్లతో విధి ఆడుతున్న చదరంగంలో
పేద పావుల బలి పీఠ మిది!.
నిత్య నగ్న జీవిత సత్యమిది !!
స్వార్ధ నాయకుల పదవుల పోరాటంలో
చిందిన బిఖారి నెత్తుటి పధ మిది!.
నిత్య నగ్న జీవిత సత్యమిది !!
గెలుపు డప్పుల దడ దడ మధ్య
ఎగిరిన పువ్వుల దండల మధ్య
పేదవాడి ఆకలి రేపిన సోషలు
గెలిచిన నేతకు వైవిధ్యపు జయజ ఘోషలు !!
బానిస సృంఖలాలు తెంచిన నేతలేరి?
తెల్ల నేతల గుండెలు పేల్చిన ఫిరంగులేవి?
నేర చరితల నేతల తలలు తీసే బిడ్డలేరి?
వీర పుత్రులు గన్న అక్షయ గర్భమిది
వుడుకుతున్న రక్తపు సెగల మంటలివి
ఇంకెంతో కాలం లేదు.. మంచిరోజులొస్తున్నాయి!! ====KPKonduru

==========================

నిత్య యవ్వన సౌందర్య రాశివి
సత్య కామనా మానసోల్లాసివి
వైవిధ్య శృంగార కళా పోషివి
అక్షయ అశీర్వచనాంబొధివి, తల్లివి..శాంభవీ ==== KPKonduru

========================

పేదవాడి బతుకులో ఉన్నాయట పరమాన్నాలే నిత్యం...
పెద్దవారు, మన నాయకులు చెప్పె నిత్య అసత్యం...
పూట తిండికి పేదలని, పెద్దలని ఎందుకు ఈ వైవిధ్యం?
పొరాడకుండ దొరుకుతుందా ఆకలికాలంలొ అక్ష్యం?? =====vEturiR

=====================================

కొందరు జీవిస్తుంటారు కలల్లొనే నిత్యం
కలలు కల్లలవగానె తెల్స్తుంది అసలు సత్యం
అపుదె మొదలవుతుంది ఈ రెండెంటి మధ్య వైవిధ్యం
ఆ గడబిడలొ వారికి పరిష్కరం లేని సమస్యలే అక్షయం ====SeetaKumaari

No comments: