Wednesday, December 6, 2006

విమానం రైలుబండి బస్సు జట్కాబండి

ఊహల గగనాన విహరిస్తున్నప్పుడు
హృదయమే ఒక విమానం.
ఆలోచనలనే పట్టాలపై పరుగెడ్తున్నప్పుడు
మనసే ఒక రైలుబండి.
సర్వాంగాలనే ప్రయాణీకులను
మెదడనే డ్రైవరును,గుండే అనే కండక్టరును
కలిగి యున్న తనువే ఒక బస్సు
సంతోషమనె ఇంధనం లేనప్పుడు
దేహమనే బస్సే అవుతుంది జట్కాబండి. ====himabindu

====================

electionla time..అందరికీ తెలిసిన పరిస్థితే
తెలంగాణా అని రాస్ట్రాన్ని చీల్చె వాళ్ళు కొందరు
ఎదొ ఒకటి చేసి రాస్ట్రాన్ని centerకి అమ్మే వళ్ళు కొందరు
మంచి qualifications కల వారు మన candidatలు
కొంపలు కూల్చారు, రైలుబండ్లు తగలెట్టారు
బస్సులు పగలు కొట్టారు, దర్నాలు బందులకు stopఏలేదు
మర్డర్లు మాన భంగాలంటార, అవి చిన్నప్పుడే చేసారు
వీరికి లేనివి మానం, మర్యాద, మంచి చేసే గుణం
ఐనా, వీళ్ళని గెలిపించే వారు ఎవరు?
మనమే వొటు వుండీ, వెయ్యని ప్రభుద్దులం.
ఐనా, జట్కా బండి time నుంది, విమానాల స్థాయికి
దేశం ఎదిగింది. అదే మంచి వార్ని గెలిపించి వుంటే
ఈపాటికి దేశంలో సగం మంది, చంద్రుని మీద
కాపురాలుండేవారు, coloneeలు కట్టే వారు,
americanలు visa green cardల కోసం దేశంలొ queuలు కట్టెవారు
ఇప్పటి కైన బుద్ధి తెచ్చుకుని, కళ్ళు తెరుద్దాము.
================================ KPKonduru

No comments: