Wednesday, January 3, 2007

రణము, మరణము,స్మరణము,మారణము

పరమ శివునికి చాలు పరమ పావనమైన గంగోదకము,జాగరణము
కాలునికదె నియమము ఇష్టాఇష్టాములతో పనిలేని మరణములు
కలియుగాన ప్రజలనుధ్ధరింప చాలు దైవ స్మరణము
ఓ కలీ ప్రశాంత జీవితాల కల్గింపకు మారణము ========seetaKumari

=====================================

నవ మౌక్తిక నాసాభరణ శోభిత శాంత మూర్తివి,
ధింధిమి దిమికిట మరణ మృదంగ తాండవ పిపాసివి
కలి కల్మష మారణా తిమిర సంహారణాభిలాషివి,
నిత్య స్మరణాకాంక్షిత మనోల్లాసివి, తల్లివి..శాంభవీ =====KPKonduru

======================================
మానవ జన్మ కు ఎవ్వాడు కారణము
అతడే లిఖియించెను జరామరణము
అందుకే చెయ్యాలి అతని నామస్మరణం
ఇన్ని తెలిసినా ఎందుకో పుడమి మీద దారుణ మారణం =====SV1973

Monday, December 11, 2006

వల కల అల సిల

చేతిలో వల
నావ కింద అల
దొరికింది ఉట్టి శిల
ఔరా! ఇది ఒక కల ==== SriKaanth
======================================

యువతీ,యువకులంతా ధన, జన, యవ్వన గర్వంతో విసిరెరు ఓ వలపుల వల
ప్రేమ ముడిపడి, పెళ్ళిగా పరిణమిస్తే, జీవితం కాదా వారికి ఓ యెగసిపడే అల
ఈతి బాధల కుంపట్ల నీడుస్తూ, ప్రేమ రాహిత్యానికి లోనై, వారు కారా కదిలె ఓ సిల
గుర్తించెరుగా వారు, జీవితం అంటేనే నిరంతరంగా సాగె వాస్తవమైన ఓ కల ====ushaneni2004

మెరుపు మరుపు తలపు తెలుపు

హృదయ సీమ ఆనంద ధారలలొ తడిసినప్పుడు
కనపడును మనకు నయన తరకలలోని మెరుపు
జీవితం నెర్పే కఠినా పథాలలొ కలిగిన గాయాలకు
భగవంతుడిచ్చిన దివ్యౌషధము మతి మరుపు
మదిని నింపకు గతము మిగిల్చిన మధురస్మృతులతొనూ...
మనకు తెలియని భవిష్యత్తుపై ఆశలతొ నిండిన తలపులతోనూ
వర్తమానంలో జీవించమని జనులకు చాటుతూ
సమాజశ్రెయాస్సుకై పాటుపడుదామని ప్రపంచమునకు తెలుపు. ====himabindu

=============================

కారు మబ్బుల చీకటిలొ కాంతి వంతమైన మెరుపు లాంటి కాంత
నాకు మతి భ్రమించి మైమరపు తో నా హృదయం ఊగిసలాడుతూ
ఎచటనో చిక్కుకున్న నా తలపు నాలో కించిత్‌ నొప్పిని కలిగిస్తూ
నా వివెకము మాత్రము నన్ను ఈ లొకమునకు థిరిగి రమ్మని తెలుపుతున్నది. === MSNGupta
=================================

తన నవ్వే చూపించు ఆమె మనసు తెలుపు
ఆ కనుల వెలుగు చూసి అలిగి పోదా...మెరుపు
మనసున కొలువైనది ఈ నా చెలి తలపు
కనులు తెరచినా.....వీడిపోనిది ఈ మైమరపు =====mbnr guy

చదరంగం అనుబంధం కలిసుందాం నేర్చుకుందాం

లంచ మనే చెద రంగ రంగాలలొ వ్యాపిస్తుంది
సమజం లొని "నిజాయతీ" అను బంధా లని తెంచేసుంది
పేట్రేగిన ఆ కలి, ఆకలి సుందరంగ మందంగ నడుస్తుంది
యువత తెలివి నెర్చుకున్‌ దామోదరుని పై భారం వెసి భజన చేసెన్‌!! ====KPKonduru
========================================

జీవతమనే చదరంగంలో రాజు నేనే భటుడు నేనే
రెండు ప్రక్కలు నెనే, ఇక్కడ వున్న రుల్సే అనుబంధం
ఒకరికి ఒకరు బంధించి బడ్డారు, అన్ని నేనైతె, ఎవరికి ఎవరు?
ప్రక్క వాడి లొ ఇల నన్ను నెను చూసు కున్నప్పుడు కలిసుందాం
అన్న అలొచనకి తావు లెదు, వెరై వుండే అవకశమూ లేదు
ఈ లాజిక్కుని నేర్చుకుందాం, సర్వే జనాః సుఖినో భవంతు!! ====KPKonduru

కాలం కలకలం కలం హాలాహలం

కురుక్షేత్ర కదన రంగ మందు కలి కాలం
ఆసన్నమైనదని తెలిసి, భిష్ముడు కదన కలకలం
నడుమ వచించి నట్టు, వ్యాస భగవానుని కలం
నుండి సంసార జలధి మధనమున వెలువదిన హాలాహలం
ఉపసమనమునకు, అందించిన ఔషదమే విష్ను సహస్ర నామము. ==KPKonduru
======================================

ప్రకృతి తన అందాలతొ మన కనులకు
విందును కలిగించె కాలం వసంత కాలం
ప్రాతః సమయాన మన్సుకు మైమరుపు
కలిగించె తీయని గానం పక్షుల కలకలం.
భగవత్‌ సృష్టిని తన కాలుష్య కలంతొ
తిరిగి రాస్తున్న నరునికి తన చర్యల ఫలమే హాలహలం. ====Himabindu
======================================
ఎద కోయిల ఎగరసాగె ఎదురయ్యెనని వసంతకాలం...
మది నిండ ఎన్నొ మరవలెని గత స్మ్ర్తుల కలకలం...
అది మోడు వారిన పాడు తలంపుయని పట్టినాను కలం...
పదాలుగ మారింది నా మది గదిలొ నిండిన హాలాహలం...!!! ====vEturiR

వలపు తెలుపు నలుపు కలుపు

(1)
అలనాటి మహా నటి సావిత్రి, వలపు
వలలో పడి తోటి నటుడికి స్వచ్చమైన తెలుపు
లాంటి జీవితాన్ని అర్పించ, తెలుపు నలుపు
లకు తేడాలేని ఆ జీవి ఆమె జీవితాన్ని కలుపు
మొక్కవలె నాశనము చేయ ఆంధ్రులందరి
హ్రుదయాలు ఆమెకై పరితపించె

మహా నటి సావిత్రి పై అభిమానముతో ===SeetaKumari

==============================

నే ప్రెమించిన ప్రియురాలి వర్ణంబు తెలుపు.
తనకై నే కొన్న చిర రంగు కారు నలుపు
నా బహుమతి గైకొన్న మరల తను క్రుపించె ప్రేమ వలపు
హే కృష్నా ఇంక తళలేను మా ఇరువురిని ఒక్కతిగ కలుపు ====ChatrapatiShivaaji

Thursday, December 7, 2006

రాగం భాగం అనురాగం చదరంగం

ప్రతి మొదటి అనుభూతి మన మదిలొ ఒక ముద్ర వేస్తుంది
మొదటి లాలి కల్యాణి రాగమై చిచ్చు కొడుతుంది
మొదటి పలుకు అమ్మ చెవిని చేరి ధన్య మవుతుంది
మొదటి గిలక్కై గురుతుకొచ్చి నవ్వు తెప్పిస్తుంది
మొదటి స్నేహం మనుగడలో భాగమై గురుతుంటుంది
మొదటి పరీక్ష జీవితానికి దారి వేస్తుంది
మొదటి ప్రేమ యెదలొ అనురాగమై లీన మవుతుంది
ఒక్కొక్క అనుభవం ఒక గడిగా
కూర్చ బడిన చదరంగమే మన జీవితం
ఏ ఒక్క గడి మరచినా చదరంగంలో గెలవలేము ...

============================== KPKonduru

సింధూరారుణ కిరణ భూషితయు
సంధ్యా రాగ మాలికా విలసితయు
కాల చకరార్ధ భాగ నివసితయు
బూపాళమనురాగ పరివేస్ఠితయు
శ్రి చకర పుర వసితయు
నా హృది నిద్రాణములు చెదరంగ వెలసినదియు
నగు సంధ్యా గాయత్రి కభివాదములు!!
============================== KPKonduru